Share News

వండానిపేటలో కొట్లాట.. ముగ్గురికి గాయాలు

ABN , Publish Date - May 13 , 2026 | 12:33 AM

మండలం లోని వండానిపేట గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య జరిగిన కొట్లాటలో ముగ్గురికి గాయాల య్యాయి.

వండానిపేటలో కొట్లాట.. ముగ్గురికి గాయాలు

రేగిడి, మే 12(ఆంరఽధజ్యోతి): మండలం లోని వండానిపేట గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య జరిగిన కొట్లాటలో ముగ్గురికి గాయాల య్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్నాళ్లుగా గ్రామంలో రెండు వర్గాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఇటీవల సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో గ్రామంలో టీడీపీ మద్దతుదారులు రక్షిత కులా యిలు వేస్తున్నారు. ఈక్రమంలో రెండు కుటుంబాల మధ్య కులాయిల విషయమై ఘర్ష ణ జరిగింది. దీనిపై ఇరువర్గాలు కలుగజేసుకోవటంతో కొట్లాటకు దారితీ సింది. ఈక్రమంలో వైసీపీ మద్దతుదారులు టీడీపీ మద్దతుదారుడైన ముంజేటి జనార్దన నాయుడి ఇంటిపై ముకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో జనార్దననా యుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భార్య అన్నపూర్ణను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చారు. గాయపడిన జనార్దననాయుడును రాజాం ఆసుపత్రిలో చేర్చారు. అలాగే అంతకముందు జరిగిన కొట్లాటలో వైసీపీ మద్దతుదారు వియ్యపు జనార్దనరావుకు తలకు తీవ్ర గాయం కాగా, మరో వ్యక్తి వియ్యపు వెంకటరమణ కు శరీర భాగాలపై గాయాలయ్యాయి. వీరిద్దరూ రాజాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారిని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహనరావు, వైసీపీ రాజాం నియోజకవర్గం ఇన్‌చార్జి తలే రాజేష్‌లు వేర్వేరుగా పరామర్శించారు.

పరస్పర ఫిర్యాదులపై 14 మందిపై కేసు

వండానిపేటలో కొట్లాట, దాడి కేసులో ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులపై 14 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బాలకృష్ణ స్థానిక విలేకర్లకు తెలిపారు. టీడీపీ మద్దతుదారుడు ముంజేటి జనార్దననాయుడిపై దాడికి పాల్పడిన కేసులో వియ్యపు చక్రపాణితో పాటు మరో 10 మందిపై, వైసీపీ మద్దతుదారులు గాయ పడిన కేసులో నారు శ్రీనుతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:33 AM