డోలపేటలో కొట్లాట.. ఆరుగురికి గాయాలు
ABN , Publish Date - May 05 , 2026 | 12:38 AM
డోలపేట గ్రామంలో రెండు సెంట్ల స్థలం కోసం ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఆరుగురికి గాయాలయ్యాయి.
రాజాం రూరల్, మే 4(ఆంధ్రజ్యోతి): డోలపేట గ్రామంలో రెండు సెంట్ల స్థలం కోసం ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం మున్సిపాలిటీ పరిధిలో ని డోలపేట గట్టుపై రెండు సెంట్ల స్థలానికి సంబంధించి చల్లా భుజంగరావు, యారబాటి కృష్ణ వర్గాల మధ్య గత ఐదేళ్లగా వివాదం కొనసాగుతోంది. ఈ నేప థ్యంలో సోమవారం ఉదయం వివాదస్పద స్థలంలో మరోసారి రెండు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది. ఈక్రమంగా ఇరువర్గాలు కొట్టుకున్నారు. తమపై కృష్ణ, లక్ష్మి, బాలు, సీత తదితరులు రాళ్లు, గునపంతో దాడిచేసి తీవ్రంగా గాయ పరిచారని చల్లా భుజంగరావు ఆరోపిస్తున్నారు. ఆ స్థలం తమదేనని దుర్గాదేవి, భానుమతి, కృష్ణవేణిల పేరుతో 30 ఏళ్లుగా పట్టాలున్నాయని ఆయన పేర్కొంటు న్నారు. ఇదిలా ఉంటే తమపై చల్లా భుజంగరావుతో పాటు మజ్జి కృష్ణ, విజయల క్ష్మి, మీసాల గౌరి, జగధీష్, కృష్ణవేణి, శ్రీను తదితరులంతా రాళ్లతో దాడిచేసి గాయ పరిచారని మరోవర్గానికి చెందిన యారబాటి కృష్ణ ఆరోపిస్తున్నారు. గాయపడిన వారంతా రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజాం ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు క్షతగాత్రులతో మాట్లాడి.. కొట్లాటకు దారితీసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాలు పరస్పరం పొలీసులకు ఫిర్యాదు చేశారు.