Share News

child couldn’t be saved!” జ్వరం తగ్గినా.. చిన్నారి దక్కలే!

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:18 AM

“Fever subsided… but the little child couldn’t be saved!” ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగబిడ్డ జన్మించడంతో ఆ దంపతులు ఎంతో సంబరపడ్డారు. బాలుడిని కంటికి రెప్పలా చూసుకుంటూ సంతోషంగా గడుపుతున్న వారిపై విధి చిన్నచూపు చూసింది. వారం కిందట జ్వరం బారిన పడిన రెండు నెలల గిరిజన బాలుడు.. ఆ తర్వాత తేరుకుని ఉన్నట్టుండీ మృతిచెందాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 child couldn’t be saved!” జ్వరం తగ్గినా.. చిన్నారి దక్కలే!

  • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

సీతంపేట,ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగబిడ్డ జన్మించడంతో ఆ దంపతులు ఎంతో సంబరపడ్డారు. బాలుడిని కంటికి రెప్పలా చూసుకుంటూ సంతోషంగా గడుపుతున్న వారిపై విధి చిన్నచూపు చూసింది. వారం కిందట జ్వరం బారిన పడిన రెండు నెలల గిరిజన బాలుడు.. ఆ తర్వాత తేరుకుని ఉన్నట్టుండీ మృతిచెందాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన సీతంపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బిల్లగూడ గ్రామానికి చెందిన సవర రమేష్‌, లక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రమేష్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలో కుసిమి పీహెచ్‌సీలో ఉన్న అంబులెన్స్‌కు డ్రైవర్‌గానూ పనిచేస్తున్నాడు. కాగా వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానంగా ఇటీవల బాలుడు జన్మించాడు. దీంతో వారెంతో మురిసిపోయారు. అయితే వారం రోజుల కిందట బాలుడికి జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు బాలుడ్ని పాలకొండలోని ఒక ప్రైవేట్‌ క్లీనిక్‌లో చూపించి వైద్యం అందించారు. మందులు వాడిన నుంచి బాలుడు చక్కగానే ఉన్నాడు. అయితే సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి బాలుడు గుక్కతిప్పకుండా ఏడుస్తూ మృతిచెందినట్లు బాలుడు తండ్రి రమేష్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.

Updated Date - Aug 25 , 2026 | 12:18 AM