Share News

Fever వణికిస్తున్న జ్వరాలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:30 PM

Fever Outbreak Sparks Concern ఏజెన్సీలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసిన జ్వరపీడితులు కనిపిస్తున్నారు. చలిజ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో గిరిజనులు మంచం పడుతున్నారు.

Fever  వణికిస్తున్న జ్వరాలు
సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఓపీ వద్ద రోగులు ఇలా..

సీతంపేట రూరల్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసిన జ్వరపీడితులు కనిపిస్తున్నారు. చలిజ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో గిరిజనులు మంచం పడుతున్నారు. ఐటీడీఏ పరిధిలోని కుసిమి, దోనుబాయి, మర్రిపాడు పీహెచ్‌సీల పరిధిలో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారు. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో సోమవారం రోగులతో కిటకిటలాడింది. ఓపీ 357 వరకు నమోదైంది. వాటిలో 10వరకు మలేరియా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మలేరియా బాధితులతో పాటు వైరల్‌ ఫీవర్లతో బాధపడుతున్న రోగులతో సీతంపేట ఏరియా ఆసుపత్రి బెడ్లన్నీ నిండిపోయాయి.



Updated Date - Jun 08 , 2026 | 11:30 PM