Pensions పింఛన్లతో పండుగ
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:45 PM
Festival Cheer with Pensions ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో ప్రతినెలా పేదల ఇంటికి పండుగ వస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం పట్టణంలో 28, 29 వార్డుల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల సొమ్ము అందించారు.
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు, ఫిబ్రవరి28(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీతో ప్రతినెలా పేదల ఇంటికి పండుగ వస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం పట్టణంలో 28, 29 వార్డుల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ల సొమ్ము అందించారు. మంచానికే పరిమితమైన దివ్యాంగులు, వితంతువులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పింఛన్లతో వృద్ధులు, వింతంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక మద్దతు లభించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా అర్హులందరీ పింఛన్ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. త్వరలోనే రాష్ట్ర సర్కారు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు (చిట్టి), పార్టీ నాయకులు శోభారాణి, రమేష్, తాతాజీ, భీమారావు, మోహన రావు తదితరులు పాల్గొన్నారు.