బైక్ మీద నుంచి తుళ్లిపడి..
ABN , Publish Date - May 10 , 2026 | 12:35 AM
బత్తిలి గ్రామానికి చెందిన కోట చంటి (29) అనే యువకుడు ఘనసర వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
భామిని, మే 9 (ఆంధ్రజ్యోతి): బత్తిలి గ్రామానికి చెందిన కోట చంటి (29) అనే యువకుడు ఘనసర వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చంటితో పాటు తన స్నేహితుడు మీసాల సమీర్ పని నిమిత్తం బత్తిలి నుంచి కొత్తూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సమీర్ బైక్ నడుపుతుండగా చంటి వెనుకన కూర్చున్నాడు. అయితే, ఘనసర సెంటర్‌లో సడన్ బ్రేక్ వేయడంతో చంటి బైక్ నుంచి తుళ్లిపోయి రోడ్డుపై పడిపోయాడు. ముఖానికి, తలకు గాయాల కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు బత్తిలి ఎస్‌ఐ కె.రవీంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సీతంపేట సీహెచ్‌సీకి తరలించారు. చంటి మృతితో తల్లిదండ్రులు సరోజని, ప్రకాష్ తో పాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి ఇద్దరు తమ్ముళ్లు వంశీ, సునీల్ ఉన్నారు.