ద్విచక్ర వాహనం నుంచి జారిపడి..
ABN , Publish Date - May 18 , 2026 | 11:57 PM
ద్విచక్ర వాహనం నుంచి జారిపడిన ఓ బాలు డు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
బాలుడి మృతి
నెల్లిమర్ల, మే 18(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం నుంచి జారిపడిన ఓ బాలు డు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని గుసిని గ్రామానికి చెందిన చందక తేజ్‌నా యుడు(16) ఈనెల 16వ తేదీన అదే గ్రామానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ ద్విచక్ర వాహనంపై చనమలపేట వెళ్తున్నాడు. గుసిని, చనమలపేట మధ్యలోకి వచ్చేసరికి వెనుక కూర్చున్న తేజ్‌నాయుడు ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయమయ్యింది. వెంటనే విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం శ్రీకాకుళం తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేజ్‌నాయుడు సోమవారం మృతిచెందాడు.