హెచ్‌ఎం, ప్రిన్సిపాల్స్‌కు సత్కారం
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:46 PM
సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన పాఠశాలల హెచ్‌ఎం, ప్రిన్సిపాల్స్‌ను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సత్కరించారు.
సీతంపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన పాఠశాలల హెచ్‌ఎం, ప్రిన్సిపాల్స్‌ను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సత్కరించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం రాష్ట్రస్థాయిలో బెస్ట్‌స్కూల్ అవార్డులు సాధించిన మల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం ఎ.వి.శ్రీనివాసరావు, మల్లి ఏపీఆర్ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ వాసుదేవరావులను సత్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేసి సీతంపేట ఐటీడీఏకు పేరు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పాఠశాలలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో సునీల్, డిప్యూటీ ఈవో పి.నారాయడు, స్పోర్ట్స్ ఇన్‌చార్జి జాకబ్ దయానంద్, సూపరింటెండెంట్ ఎల్.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.