Share News

Father... I will uphold your name. నాన్నా...నీ పేరు నిలబెడతా

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:04 AM

Father... I will uphold your name. నాన్నా... నువ్వు చూపిన దారిలో నడుస్తాను. నీ పేరు నిలబెడతాను. బాగా చదువుకుంటాను. అమ్మ చెప్పినట్లు వింటాను’ అని ఆర్మీ జవాన్‌ నారాయణరావు భౌతికదేహం వద్ద కుమారుడు ప్రమాణం చేస్తుంటే చూసిన వారి కళ్లు చెమర్చాయి. అచేతన స్థితిలో ఉన్న నాన్న మొహం చివరిగా చూస్తూ ఉబికివస్తున్న కన్నీరును ఆపుకుంటూనే మరోవైపు అమ్మ సూచనతో ఆ బాలుడు శవ పేటికపై చేయి ఉంచి ప్రమాణం చేశాడు.

Father... I will uphold your name. నాన్నా...నీ పేరు నిలబెడతా
కుమారుడితో ప్రమాణం చేయిస్తున్న సుజాత

నాన్నా...నీ పేరు నిలబెడతా

ఆర్మీ జవాన్‌ భౌతికదేహం వద్ద కుమారుడి ప్రమాణం

కన్నీరు పెట్టిన కుటుంబ సభ్యులు, రావాడ గ్రామస్థులు

రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదంలో జవాన్‌ మృతి

ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు

భోగాపురం, నవంబరు11(ఆంధ్రజ్యోతి): ‘నాన్నా... నువ్వు చూపిన దారిలో నడుస్తాను. నీ పేరు నిలబెడతాను. బాగా చదువుకుంటాను. అమ్మ చెప్పినట్లు వింటాను’ అని ఆర్మీ జవాన్‌ నారాయణరావు భౌతికదేహం వద్ద కుమారుడు ప్రమాణం చేస్తుంటే చూసిన వారి కళ్లు చెమర్చాయి. అచేతన స్థితిలో ఉన్న నాన్న మొహం చివరిగా చూస్తూ ఉబికివస్తున్న కన్నీరును ఆపుకుంటూనే మరోవైపు అమ్మ సూచనతో ఆ బాలుడు శవ పేటికపై చేయి ఉంచి ప్రమాణం చేశాడు.

‘ ఏమండీ... నీతో మాట్లాడి మూడు రోజులవుతోంది. నీతో మాట్లాడకపోతే ఒక రోజు కూడా గడవదు. మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే ఎలా బతికేది? అంటూ భార్య సుజాత భోరున విలపించింది.

‘నాయనా.. ఆర్మీ ఉద్యోగం అంటే ఇష్టమని చెప్పావు. అక్కడి విధులు, వీరుల సాహసాల గురించి చెప్పినప్పుడల్లా మేము చాలా ఆనందపడ్డాం. నువ్వు కుటుంబంతో సంతోషంగా ఉన్నందుకు ధైర్యంగా బతుకుతున్నాం. కానీ అంతలోనే మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా అంటూ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, లక్ష్మి గుండెలవిసేలా రోదించారు. ఆర్మీ జవాన్‌ నారాయణరావు మృతదేహానికి రావాడ గ్రామ శ్మశానవాటికలో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. చివరి చూపు కోసం గ్రామమంతా తరలివచ్చింది. కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం కన్నీటిమయమైంది.

రావాడ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ కనకల నారాయణరావు(36) రాజస్థాన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 9వ తేదీన మరో జవాన్‌తో కలిసి ఆర్మీ వాహనంలో సైనిక సామగ్రిని వేరొక ప్రాంతానికి తరలిస్తున్నాడు. రాజస్థాన్‌ కోట ప్రాంతంలో దిల్లీ- ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవేపై జాలింపుర టోల్‌ గేట్‌ సమీపంలో వీరి వాహనాన్ని ఖాళీ గ్యాస్‌ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ప్రైవేటు వాహనం బలంగా ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోగా నారాయణరావు మృతిచెందాడు. ప్రమాదంపై ఆర్మీ అధికారులు అదే రోజు కుటుంబీకులకు సమాచారం అందించారు. అనంతరం ఆర్మీ నిబంధనల ప్రకారం అన్ని కార్యకమ్రాలు పూర్తి చేసి రాజస్థాన్‌ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి నారాయణరావు మృతదేహాన్ని బుధవారం తీసుకొచ్చారు. ఆపై కల్నల్‌ రవివ్యాస్‌, లెఫ్టినెంట్‌ కమాండర్‌ నిశాంత్‌ రామ్‌వై, సేవాధల్‌ సింహాచలం ఆధ్వర్యంలో సుమారు 35 మంది ఆర్మీ, నావీ బృందం ప్రత్యేక వాహనంలో నారాయణరావు శవపేటికను ఎయిర్‌పోర్టు నుంచి ఊరేగింపుగా సవరవల్లి మీదుగా రావాడ గ్రామ శ్మశానవాటికకు తీసుకొచ్చారు. విషయం తెలిసి నారాయణరావు చివరి చూపు కోసం రావాడ గ్రామ ప్రజలంతా తరలివచ్చారు. భార్య, పిల్లలు, తల్లిదండుల్రు తీవ్రంగా రోదించారు. నారాయణరావు చిత్రపఠం, దుస్తులు, బెల్టు తదితర వస్తువులను భార్య సుజాతకు ఆర్మీ అధికారులు అందజేశారు. వాటిని తీసుకొన్న ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆర్మీ లాంఛనలతో దహన సంస్కారాలు పూర్తి చేశారు.

ఫ కనకల నారాయణరావు 2010 నవంబరులో ఆర్మీ ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం కోటా రాజస్థాన్‌లో 618 ఈఎంఈ బెటాలియన్‌లో రికవీనెక్‌(మెకానిక్‌)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య సుజాత, 9 సంవత్సరాల కుమారుడు యశ్వంత్‌, 7 సంవత్సరాల కుమార్తె తన్విత, తల్లి దండుల్రు లక్ష్మి, శ్రీనివాసరావు, అన్నయ్య రాము ఉన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 12:04 AM