Share News

విధి వంచించి.. ఆసరాను తుంచేసి!

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:25 AM

అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రికి మందులు.. ఇల్లు గడవడానికి తల్లికి తోడు.. ఆ వృద్ధ దంపతులకు చరమాం కంలో అన్నీ తానై నిలిచాడా కొడుకు.

విధి వంచించి.. ఆసరాను తుంచేసి!

  • ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం

  • వృద్ధ దంపతులకు తీరనిశోకం

అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రికి మందులు.. ఇల్లు గడవడానికి తల్లికి తోడు.. ఆ వృద్ధ దంపతులకు చరమాం కంలో అన్నీ తానై నిలిచాడా కొడుకు. అరకొర జీతమే అయినా ఆ ఇల్లు ఆనందం గా గడిచిపోతోంది. కానీ ఒక్క రోడ్డు ప్రమాదం వారిని దిక్కులేని వారిగా చేసే సింది. అంతులేని కడుపుకోతను మిగిల్చేసింది. ఉదయమే ఉద్యోగా నికి వెళ్లిన కొడుకు శాశ్వతంగా తిరిగిరాకపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెల విసేలా రోదించారు.

రాజాం రూరల్‌, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని బెర్హంపూర్‌ ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు జమ్మ సతీష్‌బాబు, ధనలక్ష్మి బతుకు తెరువు కోసం ఏడాది కిందట కుమారుడు సాయి సురేష్‌(30)తో కలిసి రాజాం వచ్చి, మల్లికా ర్జున కాలనీ మూడోలైన్‌లో జీవనం సాగిస్తున్నారు. రాజాం వచ్చిన కొద్దిరోజుల్లోనే కొడుకు ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో ఉద్యోగంలో చేరాడు. తండ్రి సతీష్‌బాబు అనా రోగ్యానికి గురి కావడం, తల్లి ధనలక్ష్మి గృహిణిగా ఉండడంతో అందివచ్చిన కొడు కుపైనే ఆ దంపతులు ఆశలు పెట్టుకున్నారు. నెలనెలా వచ్చే జీతంతో కుటుంబం హాయిగా జీవిస్తోంది. అయితే శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే విధులకు పొం దూరు వెళ్లి, తిరిగి రాజాం వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. తలకు తీవ్రంగా గాయాలైన సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సల్మాన్‌ బేగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 08 , 2026 | 12:25 AM