రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:06 AM
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని మార్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమర్ల నియెజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు.
భోగాపురం, జనవరి 20(భోగాపురం): రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని మార్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమర్ల నియెజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. మంగళవారం పోలిపల్లి గ్రామంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో నూతన కార్యవర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్‌గా కర్రోతురాంనాయుడు, డైరెక్టర్లగా బంటుపల్లి మురళీధర్, పతివాడ బంగార్రాజు ఎన్నిక కాగా, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే లోకం నాగమాధవి, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు, టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, నీలాపు అప్పలరామిరెడ్డి, కోలా రామసూరి, కర్రోతు రాజు పాల్గొన్నారు.