Share News

Farmers' రైతుల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:18 AM

Farmers' Welfare Is the Ultimate Goal రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత నిధులు విడుదలైన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

 Farmers'   రైతుల సంక్షేమమే ధ్యేయం
లబ్ధిదారులతో కలెక్టర్‌

  • అన్నదాత సుఖీభవ నిధులు విడుదల

పార్వతీపురం, జూన్‌20(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత నిధులు విడుదలైన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ.83.03 కోట్లు జమైనట్లు తెలిపారు. అన్న దాత సుఖీభవ కింద ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున 1260 మంది రైతులకు 61.13 కోట్లు, పీఎం కిసాన్‌ కింద రూ.2 వేల చొప్పున 1,09,511 మందికి రూ.21.90 కోట్లు విడుదలైనట్టు చెప్పారు. పాలకొండ నియోజక వర్గంలో 33,107 మందికి రూ.22.6 కోట్లు, కురుపాంలో 39,084 మందికి 26.82 కోట్లు, పార్వతీపురంలో 25,807 మందికి రూ.17.16 కోట్లు, సాలూరులో 2,426 మంది రైతుల ఖాతాల్లో రూ.16.40 కోట్లు జమయ్యాయని వివరించారు. గత ఏడాది 1,22,260 మంది రైతులకు మూడు విడతల్లో రూ.237.55 కోట్లు విడుదల చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Jun 21 , 2026 | 12:18 AM