Farmers’ Welfare రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:25 PM
Farmers’ Welfare is the Top Priority జిల్లాలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయాధి కారులు పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 74,757 హెక్టార్లలో సాగు పూర్తయిందన్నారు. 97 శాతం పంటల సర్వే జరిగిందని తెలిపారు. నీటి ఎద్దడి, ఎల్‌నినో ప్రభావంతో దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి రైతులకు పలు సూచనలు, సలహాలు అందించాలని సూచించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయాధి కారులు పనిచేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 74,757 హెక్టార్లలో సాగు పూర్తయిందన్నారు. 97 శాతం పంటల సర్వే జరిగిందని తెలిపారు. నీటి ఎద్దడి, ఎల్‌నినో ప్రభావంతో దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి రైతులకు పలు సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. ఎరువుల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 21 రైతు గ్రూప్‌లకు కిసాన్ డ్రోన్లు కేటాయించి ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. అనంతరం 26 శాఖల కేపీఐ సూచికల పురోగతిని సమీక్షించారు. వెనుకబడిన మండలాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. నిధులు, సాంకేతిక సమస్యల కారణంగా పనులు నిలిచిపోతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పీఎం జన్‌మన్ తదితర గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అర్హులకు ఉపాధి పనులు కల్పించాలని, ఎస్‌హెచ్‌జీ రుణాలు అందించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశిం చారు. జిల్లాలో 192 పాఠశాలల పరిధిలో గుర్తించిన 351 ప్రమాదకర గదులు, భవనాలను ఈ నెలాఖరులోగా తొలగించాలన్నారు. ప్రమాదకర భవనాల్లోకి విద్యార్థులను అనుమతించరాదని, వారికోసం ప్రత్యామ్నాయ తరగతి గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఏవో భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.