రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:09 AM
రైతుల సంక్షేమమే ధ్యేయమని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. మంగళవారం రామభద్ర పురంలో వెలుగు ఆధ్వర్యంలో నిర్మించిన కష్టమ్స్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ప్రారంభించారు.
బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన
రామభద్రపురం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయమని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. మంగళవారం రామభద్ర పురంలో వెలుగు ఆధ్వర్యంలో నిర్మించిన కష్టమ్స్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మడక తిరుపతి నాయుడు, చింతల రామకృష్ణ, కర్రోతు తిరుపతి రావు, భవిరెడ్డి చంద్రా, వసంతుల తిరుపతిరావు, కోట వెంకటనా యుడు, బెవర సీతారాం, వెలుగు డీపీఎం వి.బంగారమ్మ, తహసీల్దార్ అజురఫీజాన్, వెలుగు ఏపీఎం సూరెడ్డి సత్యవతి పాల్గొన్నారు.
బాధితులకోసం జెండర్ రిసోర్స్ సెంటర్
బొబ్బిలి రూరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): బాధితుల సమస్యలన్నింటికీ ఒకే చోట పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతోనే జెండర్ రిసోర్స్ సెం టర్‌ను ఏర్పాటు చేసినట్లు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ ఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) తెలిపారు. మం గళవారం బొబ్బిలి మండల కాంప్లెక్స్‌లోని వెలుగు కార్యాలయంలో జెండర్‌రిసోర్స్ సెంటర్ ప్రారంభిం చారు.డీబీఎం బంగారమ్మ సెంటర్‌లోఅమలు చేసే కౌన్సెలింగ్ విధానం, విధివిధానాలు వివరిం చారు. కార్యక్రమంలో ఏపీఎం భాగ్యలక్ష్యి పాల్గొన్నారు.