Farmers’ Welfare రైతుల సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:37 AM
Farmers’ Welfare Is the Goal రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ‘రైతన్నా- మీ కోసం ’ కార్యక్రమం నిర్వహించారు.
సాలూరు, మార్చి16(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ‘రైతన్నా- మీ కోసం ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నదాతల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో మూడు విడతలుగా ప్రభుత్వం నగదు జమ చేసిందన్నారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం వ్యవసాయానికి సంబంధించిన పథకాలను వివరించారు.