Share News

రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:25 AM

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు.

 రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
రాజాం: వరి విత్తనాలు పంపిణీ చేస్తున్న మురళీమోహన్‌

  • రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ హామీ

రాజాం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. బుధ వారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు.అనంతరం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ,అధి కారులు వ్యవసాయశాఖ ఏడీఏ కె.చంద్రరావు, ఏవో రఘునాథ్‌ పాల్గొన్నారు.

పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలి

పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ సూచించారు. బుధవారం రాజాంలో రెండేళ్లు పాలన అనంతరం విజయోత్సవ సభ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ స్దాయిలో ఉన్న అధికారులతో సమీక్షిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీని వాసరావు, శాసపు రాజేష్‌కుమార్‌, వల్లూరు గణేష్‌ , దూబ ధర్మారావు, శాసపు రమేష్‌కుమార్‌, కమిుషనర్‌ రామచంద్రరావు, ఏడీఏ రెడ్డి తిరుపతిరావ పాల్గొన్నారు. వంగర మండలం బంగారువలస రైతులకు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశారు.

గురుకులంలో సైన్స్‌ గ్రూపుల ఏర్పాటు

రాజాం రూరల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గురుకులంలో సైన్స్‌ గ్రూపుల ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ హామీఇచ్చారు. రాజాంలో రేగిడి మండలంలోని ఉంగరాడమెట్ట వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళాశాలలో సైన్స్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ దళిత జేఏసీ నాయకులు గణపతి, తేగల మోహన్‌ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jun 18 , 2026 | 12:25 AM