రీసర్వేకు రైతులు సహకరించాలి
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:05 AM
రీసర్యే సమయంలో ప్రజలు సహకరించాలని ఇన్‌చార్జి తహసీల్దార్ టి.రమేష్ కోరారు. బుధవారం కల్లేపల్లి- రేగ గ్రామాల్లో రీసర్వే డీటీ అప్పారావుతో కలిసి ర్యాలీ, గ్రామసభలు నిర్వహించి ప్రజలకు రీసర్వేపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ రీసర్వే ఈనెల నుంచి తొమ్మిది గ్రామాల్లో ప్రారం భిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌కేఎస్.పురం, వెంకన్నపాలెం, ఖాసాపేట, రంగరాయపురం, మార్లాపల్లి, భీమాలి, నిడగట్టు, కల్లేపల్లి-రేగ రెవెన్యూలో 8,538 ఎకరాలు రీసర్వే చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ సృజన్, వీఆర్వో భాస్కర్, గ్రామ సర్వేయర్ నవీన్, కార్యదర్శి లీలా పాల్గొన్నారు.
లక్కవరపుకోట, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): రీసర్యే సమయంలో ప్రజలు సహకరించాలని ఇన్‌చార్జి తహసీల్దార్ టి.రమేష్ కోరారు. బుధవారం కల్లేపల్లి- రేగ గ్రామాల్లో రీసర్వే డీటీ అప్పారావుతో కలిసి ర్యాలీ, గ్రామసభలు నిర్వహించి ప్రజలకు రీసర్వేపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ రీసర్వే ఈనెల నుంచి తొమ్మిది గ్రామాల్లో ప్రారం భిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌కేఎస్.పురం, వెంకన్నపాలెం, ఖాసాపేట, రంగరాయపురం, మార్లాపల్లి, భీమాలి, నిడగట్టు, కల్లేపల్లి-రేగ రెవెన్యూలో 8,538 ఎకరాలు రీసర్వే చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ సృజన్, వీఆర్వో భాస్కర్, గ్రామ సర్వేయర్ నవీన్, కార్యదర్శి లీలా పాల్గొన్నారు.
ఫకొత్తవలస, డిసెంబర్ 31 (ఆంధ్రజ్యోతి): కొత్తవ లసలో రీసర్వే కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు తహసీల్దార్ పి.సునీత తెలిపారు. కొత్తవలసలో రీసర్వే గ్రామసభ నిర్వహించారు.
ఫదత్తిరాజేరు,డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి):మండలంలోని పాచలవలస, పప్పలలింగా లవలసల్లో రీసర్వే గ్రామసభలు రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ హరికిరణ్ మాట్లాడుతూ భూసర్వేపై అవగాహన కల్పించి శుక్రవారం నుంచి భూసర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుషిడి వేణు, సుంకరి సత్యం, దుప్పాడ చిన్నంనాయుడు, వైసీపీ నాయకులు సుమల గోవింద, ఆర్‌ఎస్‌డీ టి.రత్నకుమారి పాల్గొన్నారు.