రైతులకు భరోసా కల్పించాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:58 PM
రైతులకు మార్కెట్ సదుపాయం ఉందన్న భరోసా కల్పించినప్పుడే ఉద్యాన మిషన్ విజయవంతం అవుతుందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు.
విజయనగరం, కలెక్టరేట్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): రైతులకు మార్కెట్ సదుపాయం ఉందన్న భరోసా కల్పించినప్పుడే ఉద్యాన మిషన్ విజయవంతం అవుతుందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. ఉద్యాన మిషన్‌పై మంగళవారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఉద్యాన మిషన్ కింద జిల్లాలో ఈ ఏడాది పదివేల ఎకరాల్లో అదనంగా ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే సుమారు 3,300 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జరిగిందని చెప్పారు. మరో 700 ఎకరాల్లో చేయాల్సి ఉందన్నారు. కూరగా యలు, కోకో, ఆకుకూరలు, బొప్పాయి వంటి పంటలతో పాటు సుమారు 30ఏళ్ల పాటు ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్‌పామ్ వంటి పంటల సాగు వైపు మళ్లిం చాలన్నారు. 180 మీటర్ల లోపు విద్యుత్ సరఫరా ఉన్న రైతుల జాబితాలను విద్యుత్ శాఖకు ఇచ్చి వెంటనే క్షేత్ర పరిశీలన చేయించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్, ఉద్యాన శాఖ డీడీ చిట్టిరాజు, వ్యవసాయ శాఖ జేడీ రామారావు ఉన్నారు.
గృహ నిర్మాణాల ప్రగతిపై ఆగ్రహం
జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ రెండు వారాల్లో గ్రామీణ ప్రాంతంలో సుమారు 1374, పట్టణ ప్రాంతాల్లో 650 ఇళ్లు స్టేజ్ కన్వర్షన్ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ, పెద్దగా ప్రగతి కనిపించ లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై మండల ప్రత్యేకాఽధికారులు దృష్టి పెట్టాలన్నారు. కొన్ని సచివాల యాల పరిధిలో సున్నా ప్రగతిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కార్యదర్శులు దీనికి బాధ్యత వహించాలన్నారు.
భూసేకరణ పూర్తి చేయాలి
జిల్లాలోని వివధ ప్రాజెక్టులకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రామసుం దర్‌రెడ్డి ఆదేశించారు. తారకరామ తీర్థ సాగర్, తోటపల్లి ప్రాజెక్టుకు, జాతీయ రహదారులు తదితర ప్రాజెక్టులకు భూసేకరణ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పూర్తయిన వాటికి బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో మురళి, ఆర్డీవోలు పాల్గొన్నారు.