ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు మేలు: ఎమ్మెల్యే అదితి
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:27 AM
: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదని...దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు.
వీజెడ్పీ1:విజయనగరం రూరల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదని...దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. గురువారం విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన మండల స్థాయి సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అదితి గజపతిరాజు మాట్లాడుతూ ఇప్పటికే మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా రైతులను చైతన్యవంతులను చేసినట్టు చెప్పారు. వర్షాలు విస్తృతంగా పడకపోవడం వల్ల ఫాంపాండ్స్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనం కూడా ఉండదని ఆమె స్పష్టం చేశారు. మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మత్స్య, పశు సంవర్థకశాఖ, ఉద్యానవనశాఖ అధికారులతో పాటు, విజయనగరం ఎంపీడీఓ గంటా వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.