Fake Revenue Records నకిలీ రెవెన్యూ రికార్డుల కలకలం
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:46 PM
Fake Revenue Records Stir Controversy పాలకొండ మండలం భాసూరు గ్రామంలో నకిలీ రెవెన్యూ రికార్డుల అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపి రికార్డు ట్యాంపరింగ్‌కు పాల్పడిన దోషులను గుర్తించాలని తాజాగా సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పాలకొండ సీఐ ప్రసాదరావును ఆదేశించారు.
పాలకొండ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): పాలకొండ మండలం భాసూరు గ్రామంలో నకిలీ రెవెన్యూ రికార్డుల అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపి రికార్డు ట్యాంపరింగ్‌కు పాల్పడిన దోషులను గుర్తించాలని తాజాగా సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పాలకొండ సీఐ ప్రసాదరావును ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. 1993 ముందు నాటికి బాసురు సర్వే నెంబర్ 170లో మండ ప్రకాశం పేరిట 50 సెంట్ల జిరాయితీ భూమి ఉండేదని కొన్నాళ్లుగా రెవెన్యూ అధికారులు రికార్డులు చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఈసీ రికార్డు, సబ్ రిజిస్ర్టార్ కార్యా లయం మార్ట్‌గేజ్ డాక్యుమెంట్లలో మాత్రం ప్రకాశం పేరిట ఆయా సర్వే నెంబర్లలో 1.20 సెంట్ల జిరాయితీ భూమి నమోదైంది. భాసూరు పీఏసీఎస్ సొసైటీ సీఈవో స్వయంగా రెవెన్యూ అధికారులకు ఇచ్చిన పత్రాల్లోనూ పై విధంగానే ఉంది. కాగా తన భూమి ఆక్రమణ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు రెవెన్యూ అధికారులు ఈ నకిలీ రికార్డులను సృష్టించారని అదే గ్రామానికి చెందిన వి.వెంకటగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పాలకొండ సీఐ మూడుసార్లు తహసీల్దార్‌కు వివరణ కోరారు. తాజాగా సబ్ కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులకు విచారణకు సిద్ధమవుతున్నారు.