బకాయిలు చెల్లించక.. ఆశీలుపాట నిర్వహించక..
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:13 AM
మండ లంలోని పురిటిపెంట పంచాయతీలో రోజువారి ఆశీ లు వేలంపాటకు పాత బకాయిలు చెల్లించడంలేదు.
పురిటిపెంట పంచాయతీ ఆదాయానికి గండి
పంచాయతీ నిర్వహణ ఖర్చుకు తప్పని ఇబ్బందులు
గజపతినగరం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండ లంలోని పురిటిపెంట పంచాయతీలో రోజువారి ఆశీ లు వేలంపాటకు పాత బకాయిలు చెల్లించడంలేదు. దీంతోపాటు కొత్తగా వేసిన వేలంపాట రద్దయింది. దీంతో పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. ఈ ఏడాది మార్చి 31న ఆశీలుపాట నిర్వహించనప్ప టికీ పాత బకాయిలు చెల్లిస్తేనే ఆశీలుపాట నిర్వహిం చాలని గ్రామస్థులు డిమాండ్ చేయడంతో పాటను రద్దు చేశారు. దీంతో ఆశీలును పంచాయతీ సిబ్బందే వసూలు చేస్తున్నారు. ప్రతి ఏడాది మార్చిలో రోజు వారి ఆశీలు వేలం పాట నిర్వహించి వచ్చిన డబ్బుల తో పంచాయతీ నిర్వహణకు వినియోగించేవారు. ఈ ఏడాది కూడా ఆశీలుపాట నిర్వహించగా పురిటిపెంట పంచాయతీకి సంబంధించి రూ.2లక్షల 42వేల 100 కు పాట ఖరారు అయింది. అలాగే గజపతినగరం పంచాయతీకి సంబంధించి రూ.2లక్షల 20వేల 100కు పాట ఖరారైంది. ఏప్రిల్ 1 నుంచి పాటదారులు ఆశీ లు వసూలు చేసుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే రెండు పంచాయతీలకు సంబం ధించి పాత బకాయిలు వసూలు అయినంతవరకు పాట రద్దు చేయాలని రెండు పంచాయతీ గ్రామ పెద్దలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పంచాయతీ అధికారులు రెండు పంచాయతీల ఆశీల పాటను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత గజపతినగరం పంచాయతీకి సంబంధించి ఆశీలుపాట నిర్వహించి ఆశీలు వసూలు చేస్తున్నా పురిటిపెంట పంచాయతీ మాత్రం ఆశీలుపాట నిర్వహించలేకపోతుంది. ప్రతి ఏడాది లక్షల్లో వచ్చే ఆదాయం ప్రస్తుతం లేకుండాపోతుంది. పంచా యతీ నిర్వాహకులే ఆశీలు వసూలు చేస్తూ వందల్లో పంచాయతీకి జమ చేస్తున్నారు. దీంతో పంచాయతీకి రాబడి పడిపోయింది. బకాయిదారులకు డి మాండ్ నోటీసు ఇచ్చినా సమ యం కోరుతున్నారు తప్పా.. బకాయిల చెల్లింపులు మాత్రం చేపట్టడంలేదు. పంచాయతీ నిబంధనలకు అనుగుణంగా బకాయిలు చెల్లించడకుండా పాటదారులు ఆశీలుపాట పాడి పంచాయతీలకు వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో పంచాయతీ నిర్వహణ ఖర్చుకు ఇబ్బందులు తప్పడంలేదు.
డిమాండ్ నోటీస్ ఇచ్చాం..
పురిటిపెంట పంచాయతీకి సంబంధించి పాత బకాయిలు జమ కట్టాలని ఇప్పటికే డిమాండ్ నోటీస్ ఇచ్చాం. కానీ ఎటువంటి ఫలితం లేదు. జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు బకాయిదారులపై పంచాయతీ చర్యలు తీసుకుంటుంది.
- జగదీష్, ఈవో, పురిటిపెంట పంచాయతీ