Share News

పాఠశాలల్లో వసతులకు పెద్దపీట

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:20 AM

పాఠశాలల్లో మౌలిక సదు పాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

పాఠశాలల్లో వసతులకు పెద్దపీట
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి సంధ్యారాణి

పాచిపెంట రూరల్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో మౌలిక సదు పాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం పాచిపెంట కేజీబీవీలో రూ.2.12 కోట్లతో అదనపు గదుల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అలాగూ రూ.53 లక్షలతో నిర్మించిన మండల విద్యాశాఖ కార్యాల యాన్ని ప్రారంభించారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కేజీబీవీలో అదనంగా 15 మరుగుదొడ్లు నిర్మాణానికి నిధులు సమకూరుస్తామన్నారు. గత ప్రభుత్వం విద్యను, అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో రూ.112 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నా మన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్‌, నాయ కులు సూర్యనారాయణ ఉమామహేశ్వరరావు, డిప్యూటీ డీఈవో రాజ్‌కుమార్‌, ఎంపీడీవో పాత్రో, తహసీల్దార్‌ రవి, ఎంఈవోలు సత్యనారాయణ, సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:20 AM