FA-3 Exams రేపటి నుంచి ఎఫ్‌ఏ-3 పరీక్షలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:24 AM
FA-3 Exams from Tomorrow జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ఎఫ్‌ఏ-3 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గరుగుబిల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ఎఫ్‌ఏ-3 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 5 వరకు ఉదయం 9.30 గంటల నుంచి 10.45 వరకు, మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 6 నుంచి పది తరగతుల వారికి ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రశ్రాపత్రాల పంపిణీ బాధ్యతను క్లస్టర్ స్థాయి, ఎమ్మార్సీ సిబ్బందికి అప్పగించారు. ఇప్పటికే మోడల్ ప్రశ్న పత్రాలకు సంబంధించి ప్రశ్నలు, మార్కులు, తదితర సమాచారాన్ని అందించారు. దీనిపై ఎంఈవో జోగారావును వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 5వ తేదీ నుంచి ఎఫ్‌ఎ-3 పరీక్షలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.