Share News

FA-1 Exams 17 నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 11:55 PM

FA-1 Exams from August 17 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 17 నుంచి 20 వరకు ఎఫ్‌ఏ-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తూ.. మండలాల వారీగా పరీక్ష పత్రాలను అందించారు.

FA-1 Exams  17 నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షలు
గరుగుబిల్లి ఎమ్మార్సీలో ఎఫ్‌ఏ-1 పరీక్ష పత్రాలను పంపిణీకి సిద్ధం చేస్తున్న సిబ్బంది

గరుగుబిల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 17 నుంచి 20 వరకు ఎఫ్‌ఏ-1 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తూ.. మండలాల వారీగా పరీక్ష పత్రాలను అందించారు. 2026-27 అకడమిక్‌ క్యాలెండర్‌ నిబంధనల మేరకు ఉదయం 9.30 గంటల నుంచి 10.45 గంటల వరకు , మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 3.30 గంటల వరకు ఎఫ్‌ఏ-1 పరీక్షలు నిర్వహించనున్నారు. సంబంధిత ప్రశ్న పత్రాలను స్కూల్‌ కాంప్లెక్స్‌, ఎమ్మార్సీల్లో భద్రపరిచారు. ఎంఈవోలు, సీఆర్‌పీలు పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ మోడల్‌ పేపర్లను నిర్ణీత సమయానికి అందించాలని ఆదేశించారు.

Updated Date - Aug 14 , 2026 | 11:55 PM