Share News

విద్యార్థులకు నేత్ర పరీక్షలు

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:45 AM

విద్యార్థుల్లో దృష్టిలోపాలను సకాలంలో గుర్తించి చికిత్స అందించేందుకు ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు అన్నారు.

విద్యార్థులకు నేత్ర పరీక్షలు
నేత్ర పరీక్షలను పరిశీలిస్తున్న డా.జగన్మోహన్‌

వీరఘట్టం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దృష్టిలోపాలను సకాలంలో గుర్తించి చికిత్స అందించేందుకు ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు అన్నారు. శనివారం నడిమికెల్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చేపడుతున్న నేత్ర పరీక్షలను ఆయన పరిశీలించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా కళ్లజోడు అందించడంత పాటు అవసరమైన శస్రచికిత్సలను నిర్వహిస్తుం దన్నారు. ఇప్పటికే కళ్లజోడు వాడుతున్న విద్యార్థులకు మళ్లీ పరీక్షలు చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎం.మురళీధర్‌, డాక్టర్‌ రమణకుమార్‌, వైద్య సిబ్బంది డి.హారిక, పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:45 AM