విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:52 PM
జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు.
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 26(ఆంరఽధజ్యోతి): జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని ఎస్పీ దామోదర్ తెలిపారు. ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో మద్యం తాగి, పట్టుబడిన 53మందిని గురువారం అడిషనల్ జ్యూడిషీయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎంఎస్‌హెచ్‌ఆర్ తేజాచక్రవర్తి ఎదుట హాజరు పరచగా, ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.5లక్షల 30వేలు జరిమానా విధించారని ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత మూడు నెలల్లో మద్యం తాగి, వాహనం నడిపిన సుమారు 110మందికి న్యాయాధికారి జైలు శిక్ష విధించారని ఆయన చెప్పారు. విజిబుల్ పోలీసింగులో భాగంగా ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూ, మద్యం తాగి వాహనం నడుపుతున్న వారి పై కేసులు నమోదు చేస్తున్నామన్నారు.