రెండేళ్ల అభివృద్ధిని వివరించండి
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:38 PM
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి పార్టీ శ్రేణులు వివ రించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు.
విజయనగరం రూరల్, జూన్ 23 ( ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి పార్టీ శ్రేణులు వివ రించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. మం గళవారం విజయనగరంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ క్లస్టర్, యూనిట్, గ్రామ, డివిజన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, యూనిట్, డివిజన్ ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ గురువారం నుంచి ఆగస్టు పదో తేదీ వరకూ రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిం చాలని, చేసిన ప్రచార కార్యక్రమాలు ఫోటోలతో పాటు మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు.