Share News

ప్రభుత్వ పథకాలను వివరించండి

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:11 AM

ప్రభుత్వ పథకా లను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. శుక్రవారం గుమ్మ లక్ష్మీపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఐదు మండలాల టీడీపీ బూత్‌ కన్వీనర్లు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, యూనిట్‌ ఇన్‌చార్జిలతో సమా వేశం నిర్వహించారు.

    ప్రభుత్వ పథకాలను వివరించండి
సీఎం సహాయనిధి చెక్కును అందిస్తున్న జగదీశ్వరి:

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకా లను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కోరారు. శుక్రవారం గుమ్మ లక్ష్మీపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ఐదు మండలాల టీడీపీ బూత్‌ కన్వీనర్లు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, యూనిట్‌ ఇన్‌చార్జిలతో సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న స్థాని క సంస్థల విజయం సాధించాలన్నారు. టీడీపీ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా యాప్‌ను అప్‌లోడ చేసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సంబంధించిన సమస్యలను పలువురు వివరించారు. కాగా జియమ్మవలస మండలంలోని తుంబలికి చెందిన ఇప్పర్తి అనిత, గరుగుబిల్లి మండలం తోటపల్లికి చెందిన గాడిదేశి లక్ష్మి అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతుండడంతో సీఎం సహాయనిధి కింద ఇప్పర్తి అనితకు మంజూరైన రూ.28,800 చెక్కును, గాడిదేశి లక్ష్మీకి మంజూరైన రూ.60,749 చెక్కును ఎమ్మెల్యే అందించారు.

భవనానికి నిధులు మంజూరు చేయాలి

కొమరాడ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): కొమరాడ ప్రాథమికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో భవనాన్ని తొలగించి కొత్తగా భవనాన్ని మంజూరు చేయాలని టీడీపీ మండల క్లస్టర్‌ ఇన్‌చార్జి భానోజీరావు, టీడీపీ మండలాధ్యక్షుడు శేఖర్‌పాత్రుడు కోరారు.ఈ మేరకు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Updated Date - Apr 11 , 2026 | 12:11 AM