Share News

Investigations కేసుల దర్యాప్తు వేగవంతం

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:46 PM

Expediting Case Investigations పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం బలిజిపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు.

  Investigations కేసుల దర్యాప్తు వేగవంతం
రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ మాధవరెడ్డి

సీతానగరం (బలిజిపేట), సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం బలిజిపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిసరాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, వాహన తనిఖీలు చేస్తూ.. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన సిబ్బందికి సూచించారు. గంజాయి రవాణా, మాదవ ద్రవ్యాల వినియోగం, డ్రంకెన్‌ డ్రైవ్‌, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చిలకలపల్లి, పెదపెంకి, బర్లి గ్రామాల్లో పర్యటించారు. అక్కడి పోలీస్‌ సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మురగడం గ్రామంలో కె.పద్మ నివాస గృహం దెబ్బతిన్న విషయం తెలుసుకున్న ఎస్పీ .. బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందించారు. ఆయన వెంట పార్వతీపురం రూరల్‌ సీఐ రంగనాథం, ఎస్‌ఐ రాజేష్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:46 PM