Share News

Loans త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలి

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:08 AM

Expedite Sanction of Loans ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌ బ్యాంకు రుణాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.

 Loans   త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలి
అర్జీదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఏప్రిల్‌28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌ బ్యాంకు రుణాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సాలూరు మండలం తోణాం కెనరా బ్యాంకు పరిధిలో సుమారు 106 మహిళా సంఘాలు ఉన్నాయని, గత పదేళ్లుగా పొదుపు పుస్తకాల్లో నమోదు కాలేదని.. దీంతో సంఘాలకు ఇబ్బందిగా ఉందని పలువురు అర్జీ అందించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంతోపాటు పొదుపు సంఘంలో తమకు లోన్‌ మంజూరు కాలేదని, సాలూరు, పార్వతీపు రానికి చెందిన వారు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కాగా సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ప్రభుత్వ బీమా పథకాలు వర్తించేలా బ్యాంకర్లు దృష్టిసారించా లన్నారు. ముఖ్యంగా రైతులు, స్వయం సహాయ సంఘాల సభ్యులు, గిరిజనులకు బీమా కవరేజ్‌ కల్పిచడంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బీమా నమోదులో గాని, సేవలు అందించడంలో గాని ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. త్వరితగతిన క్లయిమ్‌లను పరిష్కరించి.. బాఽధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకులు పూర్తి చేయాలని, ఈ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని జేసీ తెలిపారు.

Updated Date - Apr 29 , 2026 | 12:08 AM