Share News

మార్కెట్‌ కమిటీ కార్యకలాపాలు విస్తృతం చేయండి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:20 AM

కొత్తవలస వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాకలాపాలను మరింత విస్తృతం చేయాలని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాలక మండలి సభ్యులకు సూచించారు.

మార్కెట్‌ కమిటీ కార్యకలాపాలు విస్తృతం చేయండి

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే లలితకుమారి

కొత్తవలస, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): కొత్తవలస వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాకలాపాలను మరింత విస్తృతం చేయాలని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాలక మండలి సభ్యులకు సూచించారు. శుక్రవారం కొత్తవలస వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చొక్కాకుల మల్లునాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆమె.. మార్కెట్‌ కమిటీకి సంబంధించి శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపు కోసం తీర్మానం చేశారు. కొత్తవలసలో రైతు బజార్‌ ఏర్పాటు విషయమై చర్చించారు. పశువుల ఆరోగ్యం కోసం మార్కెట్‌ కమిటీ ద్వారా రూ.50వేలు విలువైన మందులను పంపిణీ చేసి, వైద్యం అందించాలని నిర్ణయించారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించడం కోసం తీర్మానం చేశారు. మార్కెట్‌ కమిటీ కార్యదర్శి విజయబాబు, వైస్‌చైర్మన్‌ తూర్పాటి ఆదిబాబు, ఎస్‌.కోట పీఏసీఎస్‌ అధ్యక్షుడు జి.సింహాలంనాయుడు, డైరక్టర్లు పాల్గొన్నారు.

వంతెన పనులు ప్రారంభం

జామి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని విజినిగిరి-తానవరం గ్రామాలను అనుసంధానం చేసే వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శుక్ర వారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి స్పందించి.. ఈ వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లలితకుమారి, రాంప్రసాద్‌ దంపతులతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్‌, పార్టీ మండల అధ్యక్షుడు వర్రి రమణ, పార్టీ ఎల్‌.కోట మండల అధ్య క్షుడు కరెడ్ల ఈశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:20 AM