రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:11 AM
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆదర్శవంతమైన పాలన సాగుతోందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు.
చీపురుపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆదర్శవంతమైన పాలన సాగుతోందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. బుధవారం చీపురుపల్లిలో ఏర్పాటుచేసిన కార్య క్రమంలో నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాలకు చెందిన నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, మాజీ జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, చీపురుపల్లి మాజీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి, గరివిడి మాజీ సర్పంచ్ పి. ప్రమీలకుమారి, వలిరెడ్డి లక్ష్మణరావు తదితరులు టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడారు. జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబుపై నమ్మకంతో తాను పార్టీలోకి వచ్చానని, తనపై నమ్మకంతో వచ్చిన వారికి నిరంతరం వెన్నంటి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో గద్దే బాబూరావు, పార్టీ రాష్ట్ర కార్వ నిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్నాయుడు, ఎమ్మెల్సే గాదే శ్రీనివాసులనా యుడు, కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, బీజేపీ ప్రతినిధి ఎంఎస్స్ఎన్ రాజు, కాము నాయుడు, దన్నాన రామచంద్రుడు, గవిడి నాగరాజు, పట్టణానికి చెందిన వలిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని సెగిడివీధి నుంచి చిన్న శ్రీను, శ్రీనివాసనాయుడు అభిమానులతో ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్నారు.