జాబ్ క్యాలెండర్‌పై హర్షం
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:17 AM
రాష్ట్రంలోని యువతకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ఉగాది కానుకగా ఇచ్చిందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు.
యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. దీనిపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
యువతకు ఉగాది కానుక..
చీపురుపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యువతకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ఉగాది కానుకగా ఇచ్చిందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సా గుతోందన్నారు. ఇప్పటికే సుమారు 6.28 లక్షల ఉద్యోగా లను యువతకు అందించారని చెప్పారు. వీటితో పాటు రూ.23లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల మందికి ఉపాధి లభించే విధంగా వివిధ కంపెనీలతో ఒప్పం దాలు కూడా జరిగాయన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన క్యాలెండర్‌లో నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, నియామక ప్రక్రియ ముగిసే వరకూ స్పష్టమైన గడువు విధించడం వల్ల అభ్యర్థుల్లో ఎటు వంటి గందరగోళానికి తావు లేదన్నారు.
ఉద్యోగాల కల్పనే లక్ష్యం..
భోగాపురం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్, టీడీపీ నెల్లిమ ర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నా రు. పోలిపల్లి గ్రామంలోని తన స్వగృహంలో ఆయన గురువారం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం జ్యాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉగాది కానుక ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడితో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూట మి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అనం తరం ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు నీలాపు అప్పలరామిరెడ్డి, తాతారావు తదితరులు దుస్సాలువా కప్పి, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
సంక్షేమానికి ఆద్యుడు చంద్రబాబు..
రాజాం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చం ద్రబాబు సంక్షేమానికి, అభివృద్ధికి ఆధ్యుడని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. ఈసందర్భంగా ఆ యన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం-2 పథకా లను సక్రమం గా అమలు చేస్తున్నారని, తాజాగా దివ్యాంగ శక్తి కింద దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. ఇటీవల అన్నదాత సుఖాభవ ద్వారా రైతులకు నిధులు జమ చేశారని చెప్పారు. అలాగే గురువారం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.
అభినందనీయం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల ను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం అభినందనీయమని రాష్ట్ర తూ ర్పుకాపు సంక్షేమ సంఘం ఉద్యోగుల విభాగం ఉపాధ్య క్షుడు బోనంగి తిరుపతిరావు అన్నారు. ఈ జాబ్ క్యా లెండర్ ద్వారా నిరుద్యోగ యువతకు స్పష్టమైన దిశా నిర్దేశం లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.