Share News

ఉత్సాహంగా ‘గట్టు మీద చెట్టు’

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:37 AM

సివిని గ్రామంలో ఆదివారం గట్టుమీద చెట్టు కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టారు.

ఉత్సాహంగా ‘గట్టు మీద చెట్టు’
మొక్కలు నాటుతున్న అధికారులు, రైతులు

కొమరాడ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సివిని గ్రామంలో ఆదివారం గట్టుమీద చెట్టు కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టారు. జిల్లా వ్యవ సాయాధికారి భవానీ శంకర్‌ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, స్థానిక రైతుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రైతులు నాగభూషణ రావు, జగన్నాథంనాయుడులకు చెందిన సుమారు 1.15 ఎకరాల పొలం గట్లపై ఉసిరి, జామ, మామిడి తదితర పండ్ల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గట్టు మీద చెట్టు ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు పొట్నూరు వెంకటనాయుడు, వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 12:37 AM