Excise ఎక్సైజ్‌శాఖ తనిఖీలు
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:19 AM
Excise Department Inspections అటు చూడరు.. ‘బెల్ట్’ తీయరు శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
నాలుగు కేసుల నమోదు.. నలుగురి అరెస్టు
బెలగాం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): అటు చూడరు.. ‘బెల్ట్’ తీయరు శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్‌తో పాటు సాలూరు, సీతానగరం, పాలకొండ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు బృందాలు ఏర్పాటై.. సాలూరు, పాచిపెంట, గరుగుబిల్లి, భామిని మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రత్యేక దాడులు చేశారు. ఈ దాడుల్లో నాలుగు కేసులు నమోదు చేసి తోణాం గ్రామానికి చెందిన వి.గోవింద, పాంచాలికి చెందిన పి.ఈశ్వరరావు, రావివలసకు చెందిన డి.గౌరి, పెద్దదిమిలికి చెందిన వలసనాయుడును అరెస్టు చేశారు. వారి నుంచి 27 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరిం టెండెంట్ కె.సహదేవ్ తెలిపారు.