Share News

Quality Cashew Production నాణ్యమైన జీడి ఉత్పత్తులతో రాణించాలి

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:14 AM

Excel with Quality Cashew Production నాణ్యమైన జీడిపప్పు ఉత్పత్తులతో గిరిజన మహిళలు మార్కెట్లో రాణించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. పార్వతీపురం పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన వన్‌ధన్‌ వికాస్‌ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు.

  Quality Cashew Production నాణ్యమైన జీడి ఉత్పత్తులతో రాణించాలి
జీడిపప్పు తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో

పార్వతీపురం, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన జీడిపప్పు ఉత్పత్తులతో గిరిజన మహిళలు మార్కెట్లో రాణించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. పార్వతీపురం పట్టణ పరిధిలో ఏర్పాటు చేసిన వన్‌ధన్‌ వికాస్‌ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో జీడిపిక్కలను ప్రాసెస్‌ చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. పిక్కలను ఉడికించే బాయిలర్లు విభాగం, వలిచే యంత్రాలు, గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ విభాగాలను చూశారు. అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో కాసేపు మాట్లాడారు. వారి పనితీరు, రోజువారి ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రం ద్వారా వారికి అందు తున్న లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. గిరిజన మహిళల శ్రమతో తయారవుతున్న ఈ జీడి పప్పునకు ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లో మంచి బ్రాండ్‌ విలువ కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రం ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:14 AM