ఏర్పాట్లు పరిశీలిస్తూ.. అధికారులతో సమీక్షిస్తూ..
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:03 AM
మంత్రి నారా లోకేశ్ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్ర యానికి శుక్రవారం సాయంత్రం వచ్చారు. 6.15 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉన్నారు.
నాలుగు గంటల పాటు ఎయిర్‌పోర్టులో మంత్రి నారా లోకేశ్
విజయనగరం, జూలై 24(ఆంధ్రజ్యోతి): మంత్రి నారా లోకేశ్ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్ర యానికి శుక్రవారం సాయంత్రం వచ్చారు. 6.15 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. తొలుత ఎయిర్ పోర్టు అంతా కలియదిరిగారు. ఆగస్టు 1న ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండ డంతో ఆయన పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీ పురం మన్యం జిల్లాల నుంచి 3 లక్షల మంది ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని మోదీ బహిరంగసభకు హజరవుతారని, అందుకు తగ్గట్లుగా ఏర్పట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రధాని సభను విజయవంతం చేయాలని కోరారు. సమీక్షలో రాష్ట్ర మంత్రులు, పలువురు టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
భోగాపురం, జూలై 24(ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్స వానికి వస్తున్న ప్రధాని నరేద్రమోదీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పలువురు ఉన్నత అధికారులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు, స్పెషల్ ఆపీషర్ వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున్, ఏసీఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్‌జెట్టీ, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, జేసీ సేతుమాధవన్, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు తదితరులు ఏర్పాట్లు పరిశీలించారు.
ఎయిర్ పోర్టుకు 20 ఈ-బస్సులు
విజయనగరం రింగురోడ్డు, జూలై 24(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఈ-బస్సు సేవ పథకం ద్వారా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రాయానికి 20 ఈ-బస్సులను కేటాయించినట్లు రవాణాశాఖమంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం విశాఖ స్టీల్‌సిటీ డిపోలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఈ బస్సులను ప్రారంభించారు. విశాఖకు కేటాయించిన 100 ఈ-బస్సుల్లో 20 బస్సులను భోగాపురం ఎయిర్ పోర్టుకు కేటాయించినట్లు తెలిపారు. రెండు మార్గాల్లో 10 చొప్పున బస్సులను నడపనున్నట్లు తెలిపారు.