స్ట్రాంగ్‌రూం ఏర్పాటుకు పరిశీలన
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:57 PM
మరికొద్ది రోజుల్లో జరగనున్న రాజాం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని జీఎంఆర్ వరల క్ష్మి సెయింటాన్స్ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌రూంను చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి మంగళ వారం పరిశీలించారు.
రాజాం/ రూరల్, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మరికొద్ది రోజుల్లో జరగనున్న రాజాం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పట్టణంలోని జీఎంఆర్ వరల క్ష్మి సెయింటాన్స్ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌రూంను చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి మంగళ వారం పరిశీలించారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులు భద్రపరిచేందుకు పాఠశాల అనువుగా ఉం దా.. లేదా అనే అంశాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావుతో చర్చించారు. పాఠశాల ప్రాంగణాన్ని, లోపలి గదులను పరిశీలించారు. బాక్సులను భద్రపరిచేందుకు అవసరమైన గదులను గుర్తించారు. మున్సిపాలిటీలో 32 వార్డులకు సంబం ధించి 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్డీవో వెంట రాజాం టౌన్ సీఐ నవీన్‌కుమార్, ఏఈ వెంకటరామ్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.