Share News

Everything is set for the municipal elections మునిసిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Nov 26 , 2026 | 12:20 AM

Everything is set for the municipal elections రెండు దశాబ్దాల తరువాత జరుగుతున్న రాజాం మునిసిపల్‌ ఎన్నికలకు అఽధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

Everything is set for the municipal elections మునిసిపల్‌ ఎన్నికలకు   సర్వం సిద్ధం
రాజాం నుంచి మెటీరియల్‌తో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్తున్న సిబ్బంది

మునిసిపల్‌ ఎన్నికలకు

సర్వం సిద్ధం

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన బ్యాలెట్‌బాక్సులు, ఎన్నికల సిబ్బంది

చైర్‌పర్సన్‌ బరిలో నలుగురు

32 వార్డులకు 89 మంది అభ్యర్థులు

భారీగా పోలీస్‌ బందోబస్తు

రాజాం రూరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రెండు దశాబ్దాల తరువాత జరుగుతున్న రాజాం మునిసిపల్‌ ఎన్నికలకు అఽధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వరలక్ష్మి సెయింటాన్స్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి మునిసిపాలిటీ పరిధిలోని ఐదు గ్రామాలలో ఏర్పాటు చేసిన 49 పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్‌ బాక్సులు, ఎన్నికల మెటీరియల్‌ను రాజాం మునిసిపల్‌ కమిషనర్‌, సహాయ ఎన్నికల అధికారి రామచంద్రరావు ఆధ్వర్యంలో సిబ్బందికి బుధవారం అందజేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సిబ్బందిని తరలించేందుకు వీలుగా తొమ్మిది రూట్లు, నాలుగు జోన్లుగా విభజించారు.

సెయింటాన్స్‌ పాఠశాలలో స్ట్రాంగ్‌రూంను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 98 బ్యాలెట్‌ బాక్సులు అవసరం కాగా 110 బాక్సులను ఎన్నికల యంత్రాంగం అందజేసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 55 మంది పీఓలు, అదే సంఖ్యలో ఏపీఓలు, 220 మంది ఓపీఓలతో పాటు 55 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 21 సంవత్సరాల తరువాత తొలిసారిగా జరుగుతున్న రాజాం మునిసిపల్‌ ఎన్నికలలో కూటమి తరపున జనసేన అభ్యర్థిని బేరి సౌజన్యలత, పోటీలో ఉండగా వైసీపీ తరపున పాలవలస పద్మావతి పోటీ చేస్తున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు సైతం చైర్‌పర్సన్‌ పదవికోసం పోటీ చేస్తున్నారు. కాగా 32 వార్డులకు సంబఽందించి 89 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మునిసిపాలిటీలో 36,786 మంది ఓటర్లున్నారు. వీరిలో 18,260 మంది పురుషులు కాగా 18,524 మంది మహిళా ఓటర్లున్నారు. ఇతరులు ఇద్దరున్నారు. మునిసిపాలిటీలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 5వ వార్డులో అత్యధికంగా 1436 మంది ఓటర్లుండగా అత్యల్పంగా 12వ వార్డులో 892 మంది ఓటర్లున్నారు. మొత్తం ఓటర్లలో 25,175 మంది బీసీలు కాగా, 4530 మంది ఎస్సీలు, 435 మంది ఎస్టీ కేటగిరీకి చెందగా ఓసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 6646 మంది ఉన్నారు.

ఫ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ నవీన్‌కుమార్‌ సందర్శించారు. ఎన్నికల విధులకు నియమించిన పోలీస్‌ సిబ్బందికి డీఎస్పీ సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు. శాంతిబధ్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వ్యక్తులైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 450 మందిని బైండోవర్‌ చేసినట్లు డీఎస్పీ రాఽఘవులు స్పష్టం చేశారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం

మునిసిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కమిషనర్‌ ఏ.రామచంద్రరావు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి 49 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, 36,783 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ఆయన వెల్లడించారు. చైర్‌పర్సన్‌ పదవికోసం నలుగురు, కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 89 మంది ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ కోరారు.

Updated Date - Nov 26 , 2026 | 12:20 AM