గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:40 AM
గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమ య్యింది. నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం జరిగే గణంతంత్ర దినోత్సవానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
విజయనగరం కలెక్టరేట్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమ య్యింది. నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం జరిగే గణంతంత్ర దినోత్సవానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలు, స్టాల్స్‌ను ప్రదర్శించనున్నారు. విద్యార్థుల సాంస్కాృతిక ప్రదర్శనలకు ప్రత్యేకంగా మైదానాన్ని తీర్చిదిద్దారు. పోలీసులు పరేడ్ నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. వేడుకలకు వచ్చే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి , పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. అనంతరం జిల్లా అభివృద్ధి, ప్రగతిపై ప్రజలను ఉద్దేశించి ఆయన సందేశం ఇవ్వనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన దాదాపు 500 మందికి పైబడి అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను ఆర్డీవో డి.కీర్తి అదివారం సాయంత్రం పరిశీలించారు. జెండా ఆవిష్కరణ వేదిక, అతిథుల గ్యాలరీ, పరేడ్ మైదానంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో విజయనగరం తహసీల్దార్ కూర్మనాథ్, ఆర్‌ఐ రాజు ఉన్నారు.