Share News

Everything is ready for the mahanadu పసుపు పండుగకు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 26 , 2026 | 11:43 PM

Everything is ready for the mahanadu తెలుగు తమ్ముళ్లలో కొత్త కళ కనిపిస్తోంది. జోష్‌తో మహానాడుకు సిద్ధమవుతున్నారు. అధినేత చంద్రబాబు ప్రసంగం వినాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన మార్గనిర్దేశం వినాలని తహతహలాడుతున్నారు. ఇదే సమయంలో యువనేత నారా లోకేష్‌ సందేశం, పార్టీ నాయకుల కీలక ఉపన్యాసాలు వినాలనుకుంటున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. హైబ్రిడ్‌ మహానాడు కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగి ప్రతి కార్యక్రమాన్ని స్ర్కీన్లలో వీక్షించనున్నారు.

Everything is ready for the mahanadu పసుపు పండుగకు   సర్వం సిద్ధం
గజపతినగరం మండలం గంగచోళ్లపెంటలో మహానాడు ఏర్పాట్లు

పసుపు పండుగకు

సర్వం సిద్ధం

హైబ్రిడ్‌ మహానాడుకు ఏర్పాట్లు పూర్తి

ఎక్కడికక్కడ భారీ స్ర్కీన్లు

నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ నిర్వహణ

జిల్లాలో 73 క్లస్టర్ల నుంచి పార్టీ శ్రేణులు

తెలుగు తమ్ముళ్లలో కొత్త కళ కనిపిస్తోంది. జోష్‌తో మహానాడుకు సిద్ధమవుతున్నారు. అధినేత చంద్రబాబు ప్రసంగం వినాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన మార్గనిర్దేశం వినాలని తహతహలాడుతున్నారు. ఇదే సమయంలో యువనేత నారా లోకేష్‌ సందేశం, పార్టీ నాయకుల కీలక ఉపన్యాసాలు వినాలనుకుంటున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. హైబ్రిడ్‌ మహానాడు కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగి ప్రతి కార్యక్రమాన్ని స్ర్కీన్లలో వీక్షించనున్నారు.

విజయనగరం, మే 26 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పండుగలాంటిది. ఈసారి హైబ్రిడ్‌ విధానంలో జరుగనుంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మహానాడు నిర్వహణ అనేది సంప్రదాయకంగా నడుస్తోంది. ఎన్నికలు, కరోనా లాంటి విపత్తుల సమయంలో మాత్రమే వాయిదాపడింది. అయితే ఈసారి దేశం మొత్తం పెట్రోల్‌, డీజిల్‌ వినియోగంపై పొదుపు పాటిస్తున్న తరుణంలో ఆర్భాటాలకు దూరంగా హైబ్రిడ్‌ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో ప్రతినిధులు హాజరవుతారు. అనుసంధానంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో మహానాడులు కొనసాగుతాయి. భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేస్తున్నారు. వాటిని కేంద్ర కార్యాలయంతో అనుసంధానిస్తారు. అధినేత చంద్రబాబు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. సాధారణ మహానాడు మాదిరిగా తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సైతం మాట్లాడే అవకాశం కల్పిస్తారు.

ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో..

జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లా నుంచి పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్న గంట్యాడ శ్రీదేవి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుకు వెళ్తారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మిగతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాత్రం నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఉండే హైబ్రిడ్‌ మహానాడులో పాల్గోనున్నారు. జిల్లాలోని 73 క్లస్టర్ల నుంచి ప్రతినిధులు మహానాడుకు హాజరుకానున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అయ్యన్నపేట లక్ష్మీనారాయణ ఫంక్షన్‌ హాల్‌, శ్రీనివాస కన్వెన్షన్‌ హాల్‌, మోసానిక్‌ టెంపుల్‌, తూర్పుకాపు సామాజిక భవనం, వెలమ సామాజిక కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే టీడీపీ ఐటీ విభాగం నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేసింది. నియోజకవర్గ స్థాయిలో కొంత మంది ఐటీ ప్రతినిధులు స్థానికంగా అందుబాటులో ఉండనున్నారు. బుధ, గురువారాల్లో వీరు సాంకేతికంగా సేవలందిస్తారు. మరోవైపు ఈ హైబ్రిడ్‌ మహానాడుకు హాజరయ్యే టీడీపీ శ్రేణులకు నాయకత్వం వసతులు ఏర్పాటు చేసింది. స్థానిక ఎమ్మెల్యేలు ఈ బాధ్యతను తీసుకున్నారు.

మహానాడుకు ఏర్పాట్లు పూర్తి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రెండేళ్లలో ప్రభుత్వ విజయాలను మహానాడు వేదిక ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. జిల్లా వ్యాప్తంగా వేలాది కార్యకర్తలు ఈ పండుగలో పాల్గొంటారు. అందరూ వీక్షించే విధంగా ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రాల్లో భారీ ఎల్‌.ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేస్తున్నాం. కార్యకర్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నాం.

విజయవంతం చేయాలి

జిల్లాలో హైబ్రిడ్‌ విధానంలో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశాం. 73 క్లస్టర్ల పరిధిలో పార్టీ శ్రేణులు తరలివస్తారు. పూర్తి డిజిటల్‌ విధానంలో కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి.

- కిమిడి నాగార్జున, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

Updated Date - May 26 , 2026 | 11:43 PM