Share News

వైసీపీ హయాంలో అన్నీ అక్రమాలే..

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:06 AM

వైసీపీ హయాంలో అన్ని అక్రమాలు, అన్యాయాలేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున అన్నారు.

వైసీపీ హయాంలో అన్నీ అక్రమాలే..

  • టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

విజయనగరం రూర ల్‌, జూలై 21(ఆంధ్రజ్యో తి): వైసీపీ హయాంలో అన్ని అక్రమాలు, అన్యాయాలేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ హయాం లో శాసన సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన తమ్మినేని సీతారాం భూ కబ్జాకి పాల్పడ్డారన్నారు. వేరే వారి ఆస్తిని, మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయించి, ఆ తర్వాత ఆ స్థలాన్ని తన సొంతం చేసుకున్నారన్నారు. ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. ఆయనతో పాటు, ఆ పార్టీకి చెందిన నేతలు భూ దందాలు, భూ కబ్జాలు చేశారన్నారు. అశోక్‌ గజపతిరాజుకు చెందిన స్థలాన్ని కూడా భూ మాయ చేశారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కర్రోతు నర్సింగరావు, ముద్ధాడ చంద్రశేఖర్‌, మార్తి నారాయణప్పడు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 12:06 AM