ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:28 AM
ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించాలని డీసీసీబీ చైర్మన్ నాగార్జున కోరారు.
డీసీసీబీ చైర్మన్ నాగార్జున
విజయనగరం రూరల్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించాలని డీసీసీబీ చైర్మన్ నాగార్జున కోరారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల స్టాల్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆప్కో వస్త్రాలు సంప్రదాయ నైపుణ్యాలను, కళ ను ప్రతిభింభిస్తాయన్నారు. డీసీసీబీ, వాటి అనుబం ధ శాఖల ఉద్యోగులు, పీఏసీఎస్ ఉద్యోగులు ఇక్కడ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పిల్లి రమే ష్, డీసీసీబీ సీఈవో సీహెచ్ ఉమామహేశ్వరరావు, జనరల్ మేనేజర్లు బీఎ స్‌ఎస్ ప్రసాద్, కేవీవీఆర్‌ఎన్ సత్యనారాయణ(వాసు), చేనేత శాఖాధికారులు ఎం.రా మకృష్ణ, ఆర్‌వీ మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చేనేత శాఖాధికారులతో కలిసి నాగార్జున స్టాల్స్‌లో ఉంచిన వస్త్రాలను పరిశీలించారు. ఆయన కూడా వస్త్రాలను కొనుగోలు చేశారు. వారం రోజుల పాటు నిర్వహించనున్న ఈ స్టాల్‌లో డిస్కౌంట్ రేట్లతో వస్త్రాలను విక్రయించనున్నారు.