‘ప్రతిఒక్కరూ వృద్ధులను గౌరవించాలి’
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:09 AM
సమాజంలో వృద్ధులను ప్రతిఒక్కరూ గౌరవించాలని జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు.
విజయనగరం దాసన్నపేట, జూన్ 15(ఆంధ్రజ్యోతి): సమాజంలో వృద్ధులను ప్రతిఒక్కరూ గౌరవించాలని జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. వృద్ధులపై వేదింపుల అవగాహన దినం సం దర్భంగా నగరంలోని తహసీల్దార్ కార్యాలయం, ప్రేమ సమాజం, ఎస్‌బీఐ మెయిన్, పోర్ట్ బ్రాంచ్ ప్రాంతాలలో ఆయన సోమవారం అవగాహన కార్యక్రమాలు నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స మాజంలో వృద్ధులకు ఇవ్వాల్సి హక్కులపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురువు తున్నారన్నారు. సీనియర్ సిటిజన్ హక్కులు తెలుసు కోవాలని, వారిని గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులు పాల్గొన్నారు.
రాజాం రూరల్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): వృద్ధుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు సమాజంపై ఉందని మండల న్యా య సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, సీనియర్ న్యాయా ధికారి కె.శారదాంబ తెలిపారు. వృద్ధులపై వేదింపుల అవగాహన దినం సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో ని కొండంపేటలోని వృద్ధాశ్రమాన్ని ఆమె సోమవారం సందర్శించి, అవగాహన సదస్సు నిర్వహించారు. నేటి సమాజంలో వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవు తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు సంబంధించిన న్యాయసేవలను వివరించారు. కార్యక్ర మంలో వృద్ధాశ్రమం డైరెక్టర్ శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.