Share News

ప్రతి ఒక్కరూ ధర్మమార్గాన్ని ఆచరించాలి

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:22 AM

ww

 ప్రతి ఒక్కరూ ధర్మమార్గాన్ని ఆచరించాలి

విజయనగరం కల్చరల్‌, మార్చి 18 ( ఆంధ్రజ్యోతి): సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ధర్మమార్గాన్ని ఆచరించాలని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. బుధవారం విజయనగరంలోని శంకరమఠంలో బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో కంచికామకోటి 65వ పీఠాధిపతి పుణ్యతిధి మహోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడు తూ సద్గురువుల బాట ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరా రు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సతీష్‌శర్మ మాట్లాడుతూ టీటీడీ లడ్డూ కల్తీ వ్యవహారా న్ని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలో ఇటువంటి అపచారం చోటు చేసుకోవడం భక్తులు మనోభావాలను దెబ్బతీయడమే నన్నారు. కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు టీవీ శ్రీనివాస్‌, శంకమఠం కార్యదర్శి రాజేశ్వర్‌ శర్మ, కంచి ఆస్థాన మృదంగ విద్వాంసుడు మండపాక రవి, ప్రధాన అర్చకులు పాకాల సూర్యనారాయణమూర్తి, రాంభట్ల సన్యాసిరాజు శర్మ, శ్రీకాంత్‌, సభ్యులు శ్రీనివాసరావు, ఈఆర్‌ సోమయాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:22 AM