Share News

Everyone is there అందరూ అక్కడే

ABN , Publish Date - May 26 , 2026 | 11:47 PM

Everyone is there బొబ్బిలి కమ్యూనిటీ ఆసుపత్రికి వచ్చే రోగులు విసిగిపోతున్నారు. అసలే ఎండలు ఆపై స్థలం లేక ఒకేచోట గుంపుగా ఉండాల్సి వస్తోంది. 30 పడకల ఆసుపత్రి సాఽ్థయి నుంచి 50 పడకల ఆసుపత్రి స్థాయికి పెరగడానికి దశాబ్దాల కాలం పట్టింది.

Everyone is there అందరూ అక్కడే
సీహెచ్‌సీ ఓపీలో రోగుల అవస్థలు

అందరూ అక్కడే

బొబ్బిలి సీహెచ్‌సీలో స్థలాభావం

వసతి చాలక వైద్యులు, రోగులు, సిబ్బంది అవస్థలు

డయాలసిస్‌ యూనిట్‌ వస్తే ఎక్కడ పెడతారో?

బొబ్బిలి, మే 26 (ఆంఽధ్రజ్యోతి):

బొబ్బిలి కమ్యూనిటీ ఆసుపత్రికి వచ్చే రోగులు విసిగిపోతున్నారు. అసలే ఎండలు ఆపై స్థలం లేక ఒకేచోట గుంపుగా ఉండాల్సి వస్తోంది. 30 పడకల ఆసుపత్రి సాఽ్థయి నుంచి 50 పడకల ఆసుపత్రి స్థాయికి పెరగడానికి దశాబ్దాల కాలం పట్టింది. అయినా పూర్తిస్థాయిలో వసతులు లేవు. రోగులు, వైద్యులు, సిబ్బంది, రోగుల బంధువులు నరకయాతన పడుతున్నారు. ఇంకోవైపు బొబ్బిలి సీహెచ్‌సీలో డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకోసం ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. అవసరమైన 300 చదరపు గజాల గదిని కేటాయించాలని డీసీహెచ్‌ఎస్‌ ఇటీవల స్థానిక వైద్యాధికారిని ఆదేశించారు. స్టోర్‌రూముగా వినియోగించుకుంటున్న పాతవార్డును కేటాయిం చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా స్పష్టత రాలేదు.

బొబ్బిలి సీహెచ్‌సీకి బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలకు చెందిన వారే కాకుండా పొరుగున ఉన్న మన్యంజిల్లా మక్కువ, బలిజిపేట, సీతానగరం మండలాలకు చెందిన అనేక మంది రోగులు వస్తుంటారు. గర్భిణులు ప్రసవం కోసం ఎక్కువగా బొబ్బిలి సీహెచ్‌సీని ఆశ్రయిస్తారు. దీంతో నిత్యం రోగుల రద్దీ ఉంటోంది. నిలబడడానికి కూడా ఓపీలో స్థలం లేక అవస్థలు పడుతున్నారు. 50 పడకల ఆసుపత్రిగా స్ధాయి పెంచుకున్నప్పటికీ వసతుల కల్పనకు అవసరమైన ఖాళీస్థలం లేక సీహెచ్‌సీ కిక్కిరిసి ఉంటోంది. పై అంతస్తులో ఓ భవనాన్ని నిర్మిస్తామన్న అధికారుల ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.

ఫ గ్రోత్‌సెంటరులోని ఓ పరిశ్రమ సహకారంతో సీఎస్‌ఆర్‌ ఫండ్‌ కింద సీహెచ్‌సీలో పైఅంతస్తులో ఓ బ్లాక్‌ నిర్మించి ఇస్తామన్నారు. ఇంతవరకు జరగలేదు.

డయాలసిస్‌ యూనిట్‌కు వసతి కల్పిస్తాం

డాక్టర్‌ గేదెల శశిభూషణరావు, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌, బొబ్బిలి

బొబ్బిలికి పీపీపీ మోడ్‌లో డయాలసిస్‌ యూనిట్‌ మంజూరైంది. 300 చదరపు గజాల గదిని కేటాయించాలని అధికారులు ఆదేశించారు. పాతవార్డును ఇందుకోసం పరిశీలిస్తున్నాం. గ్రోత్‌సెంటరుకు చెందిన ఓ పరిశ్రమ నిర్వాహకులు సీహెచ్‌సీ పైఅంతస్తులో ఓ బ్లాక్‌ నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఎమ్మెల్యే చొరవతో ఈ పనులకు త్వరలో శ్రీకారం చుడతాం.

Updated Date - May 26 , 2026 | 11:47 PM