Share News

ప్రతి రైతూ పంటల బీమా చేయించుకోవాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:15 AM

సింగవరం పరిసర ప్రాంతాల్లో తుఫాన్‌ ప్రభావం వల్ల నష్టపో యిన పంటలను ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి పీవీ సత్యనారాయణ శనివారం పరిశీలించారు.

ప్రతి రైతూ పంటల బీమా చేయించుకోవాలి

  • ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి సత్యనారాయణ

  • తుఫాన్‌ ప్రభావిత పంటల పరిశీలన

డెంకాడ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): సింగవరం పరిసర ప్రాంతాల్లో తుఫాన్‌ ప్రభావం వల్ల నష్టపో యిన పంటలను ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి పీవీ సత్యనారాయణ శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు పంట అంచనా విలువను బట్టి నష్టపరిహారం అందిస్తారని చెప్పారు. ప్రతి రైతూ పం టల బీమా చేయించుకోవాలని ఆయన సూచించారు. కొన్ని ప్రకృతి వైపరీత్యాలకు ఎంటీయూ 1121 అనే వరి రకం ధీటుగా నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ శాస్త్రవేత్త జి.జోగినాయుడు, జేడీఎం ఎం.రామారావు, అనకాపల్లి ఏడీ ఆర్‌సీహెచ్‌. ముకుంద రావు, ఆర్పీఎం ఏపీ సీఎంఎఫ్‌ ఎ.ప్రకాష్‌, కేవీకే.ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ కె.లక్ష్మణ్‌, విజయనగరం డాట్‌ సెంటర్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు, విజయనగ రం డివిజన్‌ ఏడీఏ సంగీత, వ్యవసాయ అధికారి నీలి మ, నైరా, రావోస్‌ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

పూసపాటిరేగ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): కుమిలి గ్రామంలో తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న వరిపంటను ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి పీవీ సత్యనారాయణతోపాటు శాస్త్రవేత్తలు, విద్యార్థులు శనివారం పరిశీలించారు. పొలాల్లో వెంటనే నీటిని తీసే ఏర్పాట్లు చేయాలని సూచించారు. మానిపండు తెగులు రాకుండా, తాలు గింజలు రాకుండా ఉండాలంటే ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రొపికొనజోల్‌ను పిచికారీ చేయాలని సూచించారు.

దెబ్బతిన్న పంటల వివరాలు పైఅధికారులకు పంపించాం..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.రామారావు మాట్లాడుతూ జిల్లాలో దెబ్బతిన్న పంటల వివరాలను పైఅధికారులకు పం పించామని తెలిపారు. వీటి కొనుగోలు కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంకా దెబ్బతిన్న పంటలు ఉంటే ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఏరువాక కేంద్రం అధిపతులు టీఎస్‌ఎస్‌కే పాత్రో, ఎంఎం శ్రీనివాస్‌, కె.లక్ష్మణ్‌, సహాయసంచాలకులు సంగీత, ఏవో నీలిమ పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:15 AM