కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పినా..
ABN , Publish Date - May 28 , 2026 | 12:48 AM
కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించి డంపింగ్ యార్డులో చెత్త వేయడాన్ని రాజన్నకాలనీ వాసులు బుధవారం అడ్డుకున్నారు.
కొత్తవలస, మే 27(ఆంధ్రజ్యోతి): కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించి డంపింగ్ యార్డులో చెత్త వేయడాన్ని రాజన్నకాలనీ వాసులు బుధవారం అడ్డుకున్నారు. కలెక్టర్ ఆదేశాలున్నాయ ని జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఎంపీడీవో రమణయ్య.. కాలనీ వాసులకు పలు విధాలుగా నచ్చచెప్పారు. అయినా కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు చేసేది ఏమీ లేక చెత్తతో నిండిన ట్రాక్టర్లను రోడ్డుపక్కనే వదిలి వెళ్లి పోయారు. కాలనీలోకే ఎవరినీ వెళ్లనీయకుండా రోడ్డుకు అడ్డంగా తాడుకట్టారు.