Share News

Even though I said I would stay... they didn't let me. ఉంటానన్నా.. ఉండనీయలేదు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:04 AM

Even though I said I would stay... they didn't let me. తాను వైసీపీలో కొనసాగుతానని స్పష్టంచేసినా, రాత్రికి రాత్రే నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించారని, ఆ తర్వాత మౌనం వహించినా, పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్‌ చేయడంపై ఆయన విజయనగరంలోని ఓ హోటల్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు.

Even though I said I would stay... they didn't let me. ఉంటానన్నా.. ఉండనీయలేదు

ఉంటానన్నా.. ఉండనీయలేదు

ఇన్‌చార్జిగా తొలగించినా మౌనం వహించాను

కనీసం సంజాయిషీ కోరలేదు

పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు

మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

విజయనగరం/ విజయనగరంరూరల్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): తాను వైసీపీలో కొనసాగుతానని స్పష్టంచేసినా, రాత్రికి రాత్రే నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించారని, ఆ తర్వాత మౌనం వహించినా, పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్‌ చేయడంపై ఆయన విజయనగరంలోని ఓ హోటల్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తన సొంత డబ్బుతో రాజకీయాలు చేశారని, ఆయనకు వైసీపీ రాజకీయంగా భరోసా ఇవ్వకపోవడం వల్లే పార్టీ మారారని బడ్డుకొండ అన్నారు. 2004 నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో రాజకీయాలు చేస్తూ వచ్చామని, ఆయనతో పాటు కొనసాగుతూ 2015లో వైసీపీలో చేరామని గుర్తు చేశారు. చిన్న శ్రీను టీడీపీలో చేరిన తరువాత జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ పెద్ద బొత్స సమక్షంలోనే తాను వైసీపీలో కొనసాగుతానని స్పష్టం చేసినా, ఆ రాత్రే తనను నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించారని అన్నారు. అయినప్పటికీ తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, కనీసం ప్రెస్‌మీట్‌ కూడా పెట్టలేదన్నారు. ఆ తరువాత తనను అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని, కనీసం తనను సంజాయిషీ కోరకుండా వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు సస్పెండ్‌ చేశామంటున్నారని వాపోయారు. అసలు వైసీపీకి క్రమశిక్షణ కమిటీ వుందన్న విషయం తనకు తెలియదని, వుంటే నన్ను పిలిచారా? నాతో మాట్లాడారా! అన్న విషయం వారికే తెలియాలని ఎద్దేవా చేశారు. విలేకర్ల సమావేశం అనంతరం పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి ఆయనరాజీనామాచేయడంతో పాటు, ఆయన అనుచరులుగా వున్న మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లు ఆయన బాటలోనే నడిచారు. విలేకరుల సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ చిక్కాల విజయలక్ష్మీ, సాంబతో పాటు నాలుగు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

---------------

Updated Date - Oct 04 , 2026 | 12:04 AM