Share News

ఆఖరి మజిలీకీ అవస్థలే..

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:54 PM

ముకుంద పురం గ్రామంలో శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు.

ఆఖరి మజిలీకీ అవస్థలే..

  • శ్మశానవాటికకు మృతదేహాలను తీసుకువెళ్లేందుకు దారి లేని వైనం

  • ముకుందపురం వాసులకు దశాబ్దాలుగా తప్పని తిప్పలు

సంతకవిటి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ముకుంద పురం గ్రామంలో శ్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. గ్రామానికి చెందిన గడే రాము అనే వ్యక్తి ఆదివారం మృతి చెందగా.. ఆ మృతదేహాన్ని పొలం గట్లపైన అతి కష్టం మీద తీసుకెళ్లాల్సి వచ్చింది. మృతదేహాన్ని నలుగురు మోసేందుకు వీలు కాకపోవ డంతో ఇద్దరే గట్లుపై మోసుకెళ్లాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి అర్థం చేసు కోవచ్చు. ఎంత భయంకరంగా ఉంటుందో. శ్మశాన వా టికకు వెళ్లేందుకు రహదారి వేయాలని గ్రామస్థులు ప్ర భుత్వ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడ పొలా నికి సంబంధించిన రైతులు తమ భూమిని శ్మశాన వాటికకు రహదారి కోసం ఇస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రోడ్డు వేయాలని కోరుతున్నారు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా..

మా చిన్ననాటి నుంచి శ్మశానవాటికకు వెళ్లేందుకు ఇదే సమస్య ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. పంట పొలాల గట్ల మీదే మృతదేహాలను తరలి స్తున్నాం. రహదారి నిర్మించాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.

Updated Date - Jan 11 , 2026 | 11:54 PM